Megastar Chiranjeevi | నేడు మహిళ దినోత్సవం సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా ఒక్కదగ్గరే చేరింది. మెగా వుమెన్స్ పేరుతో ఒక ఇంటర్వ్యూలో విడుదల కాగా.. ఈ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవితో పాటు అతడి అమ్మ అంజనాదేవి తమ్ముడు నాగబాబు, చెల్లెల్లు పాల్గోన్నారు. ఇందులో మెగా కుంటుంబంకి సంబంధించిన ఎన్నో విషయాలను చిరుతో పాటు అంజనాదేవి తదితరులు పంచుకున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలో చిరు మాట్లాడుతూ.. తన చెల్లి చనిపోయిన క్షణం ఇప్పటికీ గుర్తుకువస్తుందంటూ ఎమోషనల్ అయ్యాడు.
అమ్మకు మేము ఐదుగురు సంతానం. అయితే మరో ముగ్గురు తోబుట్టువులు నా చిన్నతనంలోనే చనిపోయారు. నాన్న ఉద్యోగంలో బిజీగా ఉన్న సమయంలో అమ్మనే ఇంట్లో అన్ని పనులు చూసుకోవడంతో పాటు గృహిణిగా అన్ని బాధ్యతలు తన మీదే ఉండేవి. దీంతో చిన్ననాటి నుంచి తనకు సాయం చేసేవాడిని. అయితే నేను ఆరో తరగతి చదువుతున్న సమయంలో నాకు రమ అనే సోదరి ఉండేది. ఒకసారి సడన్గా జబ్బుపడింది. దీంతో నేను అమ్మ కలిసి తనను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాం. నాన్నకి ఈ విషయం తెలియదు. ఆసుపత్రిలో ఉండగానే రమ కన్నుమూసింది. దీంతో తనను చేతుల్లో ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లాను. ఇంటి చుట్టుపక్కల ఉన్నవారు సాయం చేయడంతో రమ అంతక్రియలు పూర్తి చేశాం. అయితే ఈ విషయం నాన్నకి తర్వాత తెలిసింది. తాను వచ్చేవరకు అంతా అయిపోయింది. కానీ ఆ క్షణాలు నాకు ఇప్పటికీ కూడా గుర్తున్నాయి వాటికి తలచుకున్నప్పుడల్లా ఎమోషనల్ అవుతుంటా అంటూ చిరు చెప్పుకోచ్చాడు.