Stalin 4K | మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త!. 2006లో విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన ఆయన సూపర్ హిట్ చిత్రం ‘స్టాలిన్’ రీ-రిలీజ్కు సిద్ధమవుతోంది. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ చిత్రం తిరిగి థియేటర్లలో సందడి చేయనుండటంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సినిమాను ఆగష్టు 22న చిరంజీవి బర్త్డే కానుకగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది.
తమిళ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్టాలిన్’ చిత్రంలో చిరంజీవి సామాజిక సేవకుడిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించగా, మణిశర్మ అందించిన సంగీతం, ముఖ్యంగా పాటలు అప్పట్లో పెద్ద హిట్ అయ్యాయి.
HISTORY IS COMING BACK !
Mega Block Buster #Stalin4K
Re-Release On Aug 22ndOn the Eve Of Our Boss MegaStar @KChiruTweets Gari Birthday.#MegaStarChiranjeevi pic.twitter.com/9XmLk2FxFQ
— Praveen (@AlwaysPraveen7) June 28, 2025