Megastar Chiranjeevi | ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 విడుదల రోజున జరిగిన ఘటనకు సంబంధించి కథానాయకుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అరెస్ట్ అనంతరం బన్నీని పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ స్టేట్మెంట్ను రికార్డు చేస్తున్నారు. స్టేట్మెంట్ రికార్డు అనంతరం అతడిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలిసింది. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. ఈ మేరకు అల్లు అర్జున్ను రిమాండ్‌కు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే అల్లు అర్జున్ కోసం ఇప్పటికే తన తండ్రి అల్లు అరవింద్‌తో పాటు తమ్ముడు అల్లు శిరీష్ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయం తెలిసిన మెగాస్టార్ చిరంజీవి కూడా అల్లు అర్జున్ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరగా.. చిరంజీవి వస్తే.. ట్రాఫిక్ సమస్యలతో పాటు అతడిని చూడడానికి జనాలు రానుండటంతో అతడిని పోలీస్ స్టేషన్‌కు రావొద్దని అభ్యర్థించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే స్టేషన్‌కు రాకుండా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లాడు చిరంజీవి. విశ్వంభర షూటింగ్లో ఉన్న చిరు ఈ విషయం తెలియగానే షూటింగ్ మధ్యలో ఆపి బన్నీ ఇంటికి వచ్చినట్లు తెలుస్తుంది. చిరంజీవితో పాటు అతడి భార్య సురేఖ కూడా రాగా.. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి
షూటింగ్ ఆపేసి భార్యతో కలిసి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి https://t.co/iYbrSICsZk pic.twitter.com/rMNHu23W6m
— Telugu Scribe (@TeluguScribe) December 13, 2024