junior chiru name | చిరంజీవి సర్జా కొడుకు పేరు బయటపెట్టిన మేఘనా రాజ్

junior chiru name | కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలోనే అనూహ్యంగా గుండెపోటుతో మరణించిన కథానాయకుడు చిరంజీవి సర్జా. యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు అయిన చిరంజీవి సర్జా.. 2020 జూన్ 7న కేవలం 35 ఏళ్ల వయసులో హార్ట్ ఎటాక్‌తో హఠాన్మరణం చెందాడు. ఈయన మరణం అప్పట్లో ఓ సంచలనం. చిరంజీవి సర్జా చనిపోయే సమయానికి ఆయన భార్య మేఘనా రాజ్ గర్భంతో ఉండటం అందరినీ మరింత కన్నీళ్లు పెట్టించింది.
చిరు సర్జా చనిపోయిన ఐదు నెలల తర్వాత మేఘనా రాజ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో జూనియర్ చిరంజీవి మళ్లీ వచ్చేశాడు అంటూ అభిమానులు పండగ చేసుకున్నారు. అన్నయ్య కొడుకుకు 14 లక్షలతో బంగారు ఉయ్యాల బహుమతిగా ఇచ్చాడు బాబాయ్, పొగరు హీరో ధ్రువ సర్జా. ఈ బాబు పుట్టి దాదాపు ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు పేరు ప్రకటించలేదు సర్జా ఫ్యామిలీ. తాజాగా తమ వారసుడి పేరు సోషల్ మీడియాలో అధికారికంగా అనౌన్స్ చేసింది మేఘనా రాజ్. చిరంజీవి సర్జా కుమారుడి పేరు రాయన్ రాజ్ సర్జా అంటూ ప్రకటించింది మేఘన. అంతే కాదు ఈ చిన్నోడిని జూనియర్ చిరంజీవి అని అభిమానులు పిలుచుకుంటున్నారు.
మేఘన పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మేఘనా రాజ్ తెలుగులోనూ పలు సినిమాల్లో నటించింది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన బెండు అప్పారావు.. శ్రీకాంత్ లక్కీ సినిమాలో హీరోయిన్గా నటించింది మేఘన. ఆ తర్వాత కన్నడలో వరస సినిమాలు చేసింది. తన భర్త చిరంజీవి సర్జాతో ఆటగారా, రామ్ లీలా సినిమాల్లో నటించింది. ఆ సమయంలోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు ఈ జంట. కానీ పెళ్లయిన మూడేళ్లకే చిరంజీవి సర్జా మరణించడంతో మేఘనా రాజ్ షాక్‌లోకి వెళ్లిపోయింది. కొడుకు పుట్టిన తర్వాత మళ్లీ ఆ బాబులోనే తన భర్తను చూసుకుంటుంది మేఘన.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
MAA | ‘మా’ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న జీవిత, హేమ.. కారణమిదే
Tollywood Drugs Case| రకుల్ ప్రీత్ సింగ్‌పై ఈడీ ప్రశ్నల వర్షం.. 6 గంటల పాటు విచారణ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

