Chiru 154: చిరంజీవి 154వ చిత్రం నుండి మాస్ లుక్ విడుదల

రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ‘ఆచార్య’ షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసిన చిరు.. ‘గాడ్‌ఫాదర్’, ‘భోళా శంకర్’ చిత్రాల షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మరో సినిమా షూటింగ్ మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న 154వ సినిమా పూజా కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ క్రమంలో చిరంజీవి మాస్ లుక్ పోస్టర్ విడుదల చేస్తారు.
ఇందులో చిరంజీవి లైటర్ వెలిగించి సిగరెట్ కాలుస్తున్నట్టు కనిపించారు. ఈ పోస్టర్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ పరిశీలనలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.
మెగాస్టార్‌తో తన సినిమా లాంచ్ అయిన నేపథ్యంలో బాబీ చేసిన ట్వీట్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. “మెగాస్టార్, ఆయన పేరు వింటే…అంతు లేని ఉత్సాహం ! ఆయన పోస్టర్ చూస్తే..అర్ధం కాని ఆరాటం.. తెర మీద ఆయన కనబడితే…ఒళ్ళు తెలీని పూనకం, పద్దెనిమిదేళ్ల క్రితం….ఆయన్ని మొదటి సారి కలసిన రోజు కన్న కల… నిజమవుతున్న ఈ వేళ మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను.” అని ట్వీట్లో పేర్కొన్నాడు.
మెగాస్టార్, ఆయన పేరు వింటే…అంతు లేని ఉత్సాహం !
— Bobby (@dirbobby) November 6, 2021
ఆయన పోస్టర్ చూస్తే..అర్ధం కాని ఆరాటం !
తెర మీద ఆయన కనబడితే…ఒళ్ళు తెలీని పూనకం ! ❤️
పద్దెనిమిదేళ్ల క్రితం….ఆయన్ని మొదటి సారి కలసిన రోజు కన్న కల… నిజమవుతున్న ఈ వేళ మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను.🙏@KChiruTweets #Mega154 pic.twitter.com/gJONtaqUb1
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs West Indies | హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
Palamuru-Rangareddy Project | మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
Horoscope | 15-10-2026 గురువారం.. మీ రాశి ఫలాలు
KTR | కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

