19 ఏళ్ల ఇంద్ర ప్రస్థానం.. మెగాస్టార్ ఫ్యాక్షన్ డ్రామాకు బ్రహ్మరథం
అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేశారు. బాలయ్య అయితే ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. అలాంటి సమయంలో తనకు తానుగా ఓ ఫ్యాక్షన్ సినిమా చేయాలనుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి.

అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేశారు. బాలయ్య అయితే ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. అలాంటి సమయంలో తనకు తానుగా ఓ ఫ్యాక్షన్ సినిమా చేయాలనుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అందుకే తనకు నచ్చిన పరుచూరి బ్రదర్స్, చిన్ని కృష్ణను కూర్చొబెట్టి ఇంద్ర కథను సిద్ధం చేయించాడు. మొదటిసారి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేశాడు. దీన్ని సీనియర్ దర్శకుడు బి గోపాల్ డైరెక్ట్ చేశాడు. 2002, జూలై 24న విడుదలైన ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రె హీరోయిన్లుగా నటించారు. మెగాస్టార్‌కు ఎంతో ఇష్టమైన నిర్మాణ సంస్థ వై జయంతి మూవీస్ ఇంద్ర సినిమాను నిర్మించింది. ఈ చిత్రం విడుదలై నేటితో 19 ఏళ్లు పూర్తయింది. ఇంద్ర సినిమాకు ముందు వచ్చిన మృగరాజు, శ్రీమంజునాథ, డాడీ సినిమాలు నిరాశ పరిచాయి. అలాంటి సమయంలో ఇంద్ర పెద్దగా అంచనాలు లేకుండానే విడుదలైంది. కానీ వచ్చిన తర్వాత ఇంద్ర దెబ్బకు రికార్డుల షేపులు మారిపోయాయి. 122 కేంద్రాల్లో 100 రోజులు, 32 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శింపబడి రికార్డులు క్రియేట్ చేసింది.
నైజాం: 7.15 కోట్లు
సీడెడ్: 6.25 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.70 కోట్లు
ఈస్ట్: 2.15 కోట్లు
వెస్ట్: 2.00 కోట్లు
గుంటూరు: 2.42 కోట్లు
కృష్ణా: 2.13 కోట్లు
నెల్లూరు: 1.35 కోట్లు
ఏపీ + తెలంగాణ: 26.15 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 2.55 కోట్లు
వరల్డ్ వైడ్: 28.70 కోట్లు
మెగాస్టార్ చిరంజీవికి ఉన్న మార్కెట్ గురించి కొత్తగా చెప్పాలా..? అందుకే 19 ఏళ్ల కిందే ఇంద్ర చిత్రానికి 17 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం 29 కోట్ల షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. సింహాద్రి వచ్చే వరకు ఇంద్ర రికార్డులు పదిలంగా ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
బ్రహ్మాజీతో జాగ్రత్తగా ఉండు.. నాగశౌర్యకు రానా సూచన
ఆర్య ఇంట డబుల్ ధమాకా.. తల్లి అయిన అఖిల్ హీరోయిన్.. విశాల్ ఎమోషనల్
RRR సినిమా విషయంలో వివాదాలు తప్పవా?
పవర్ స్టార్‌తో ఆ హీరోయిన్ నాలుగో పెళ్లి.. ఫోటో వైరల్?
జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు వచ్చేసింది.. చరణ్ ఇంటి ముందు పార్కింగ్..!
త్రిష పెళ్లి టాపిక్ మళ్లీ వైరల్..ఇంతకీ ఎవరా వ్యక్తి.?
రాజ్ కుంద్ర సంస్థకు శిల్పాశెట్టి రాజీనామా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

