Chalapathi Rao | టాలీవుడ్ సీనియర్నటుడు చలపతిరావు మరణం టాలీవుడ్‌ను శోక సంద్రంలో నెట్టేసింది. కైకాల సత్యనారాయణ మరణం ఇంకా మరువకముందే మరో గొప్ప నటుడిని ఇండస్ట్రీ కోల్పోయింది. 1200లకు పైగా చిత్రాల్లో నటించి.. గొప్ప నటుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చలపతిరావు.. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడు. ఆయన మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తాజాగా చిరంజీవి, చలపతిరావు మృతి పట్ల సంతాపం తెలియ జేశాడు.
చలపతిరావు మరణ వార్త తనను కలిచివేసిందని చిరంజీవి తెలిపాడు. విలక్షణమైన నటుడు, తనదైన శైలితో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న శ్రీ చలపతిరావు గారి అకాల మరణ వార్త తనను కలిచివేసిందని పేర్కొన్నాడు. ఎన్నో చిత్రాల్లో ఆయనతో కలిసి నటించానని తెలిపాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, రవిబాబుకు, ఆయన కుంటుంబసభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి అని సోషల్ మీడియాలో భావేద్వేగపూరిత పోస్ట్ చేశాడు. ఇక చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఎన్టీఆర్ సహా పలువురు సినీ ప్రముఖులు చలపతిరావు మరణంపై సంతాపం ప్రకటించారు.
విలక్షణమైన నటుడు,తనదైన శైలి తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న శ్రీ చలపతి రావు గారి అకాల మరణ వార్త నన్ను కలచివేసింది.ఎన్నో చిత్రాల్లో ఆయన తో నేను కలిసి నటించడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, రవి బాబు కి, ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి.
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 25, 2022