Hanuman | టాలీవుడ్లో హనుమాన్ సినిమాపై ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో తేజా సజ్జా నటిస్తున్న ఈ సినిమాపై మొదట్నుంచి కొంత క్యూరియాసిటీ ఉంది. బడా హీరోలకు పోటీగా సంక్రాంతికి ఈ సినిమా వస్తుండటంతో ఎలా ఉంటుందో చూడాలని అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ట్రైలర్.. హనుమాన్‌పై భారీ అంచనాలు పెంచాయి. ముఖ్యంగా ట్రైలర్ ఎండింగ్లో భజరంగ్ ఎంట్రీ షాట్ మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఆ సీన్ చూసిన తర్వాత ఇప్పుడు టాలీవుడ్లో ఒక వార్త బాగా చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడనే వార్త ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.
హనుమాన్ ట్రైలర్ ఎండింగ్లో భజరంగ్ షాట్లో కనిపించింది. ముఖ్యంగా హనుమంతుడు కండ్లు తెరిచే సన్నివేశం అయితే గూస్బంప్స్ తెప్పించింది. ఇది చూశాక క్లైమాక్స్‌లో కొద్ది నిమిషాల పాటు హనుమంతుడి దర్శనం ఉంటుంది.. ఆ పాత్రలో చిరంజీవి నటించారని అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. సోషల్‌మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్‌గా మారింది. నిజానికి ఇలా రూమర్స్ పుట్టడం వెనుక ఒక కారణం ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయుడి భక్తుడని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బయటే కాదు సినిమాల్లో కాదు వీలుచిక్కినప్పుడల్లా హనుమంతుడిపై తన భక్తిని ప్రదర్శిస్తుంటాడు. తన కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రాల్లో ఒకటైన జగదేకవీరుడు అతిలోక సుందరిలో మెగాస్టార్ కాసేపు హనుమంతుడిలా కనిపించాడు. అలాగే యానిమేషన్ సినిమా హనుమాన్‌లోనూ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇప్పుడు హనుమాన్‌లోనూ ఆంజనేయుడి పాత్రలో మెగాస్టార్ నటించాడని బలంగా నమ్ముతున్నారు. అయితే ఇది నిజమా? వట్టి పుకారే అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. హనుమంతుడి పాత్రలో ఎవరు నటించారనే విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ సస్పెన్స్‌గా ఉంచేశాడు. ఆ పాత్ర చేసింది ఎవరో సినిమా చూసే తెలుసుకోవాలని చెప్పేశాడు.