HBD Megastar Chiranjeevi | ఆగస్టు 22.. ఈ తేదీ ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయిన ఒక మెగాస్టార్ పుట్టిన రోజు ఆరోజు. కొణిదెల శివశంకర వరప్రసాద్‌గా వచ్చి చిరంజీవిగా ఎదిగిన ఒక చిరంజీవి కథ ఇది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి.. ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న మెగాస్టార్ చిరంజీవి. అలాంటి హీరో పుట్టినరోజు అంటే అభిమానులకు పండగ రోజు మరొకటి లేదు. ఇక ఈ ఏడాది ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఒకేసారి అన్ని సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. దీంతో అభిమానులు మరింత పండగ చేసుకుంటున్నారు.
ఆగస్టు 22 కంటే ఒక రోజు ముందే.. అంటే ఆగస్టు 21 సాయంత్రం నుంచి చిరంజీవి సినిమాల పోస్టర్స్ విడుదల అవుతున్నాయి. ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి బర్త్ డే పోస్టర్ రెండు రోజుల కింద సోషల్ మీడియాలో లీక్ అయింది.
ఇక మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న 153వ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను శనివారం రిలీజ్ చేశారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో కలిసి సూపర్ గుడ్ మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. మలయాళంలో సూపర్ హిట్టయిన లూసిఫర్ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాలో చిరంజీవి కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు.
బాబీ దర్శకత్వంలో రాబోయే సినిమాకు సంబంధించిన టైటిల్ ఆగస్టు 22న విడుదల కానున్నట్లు ప్రీ పోస్టర్ విడుదల చేశారు. దీనికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాలం సినిమా రీమేక్ పోస్టర్ కూడా రెడీ అవుతుంది. దీనికి భోళా శంకర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రలో ఒక స్టార్ హీరోయిన్ కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఈ నాలుగు సినిమాలు అప్డేట్స్ ఈసారి చిరంజీవి పుట్టిన రోజును మరింత ప్రత్యేకంగా మార్చేశాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
గుండెపోటుతో కేరళకు చెందిన ప్రముఖ నటి మృతి..!
OTT | మెల్లిమెల్లిగా ఓటీటీలు టాలీవుడ్‌ను కమ్మేస్తున్నాయా?
మెగా డాటర్ డెబ్యూ మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
సినిమాలని వదిలేసి బిజినెస్ చేసే ఆలోచనలో మంచు మనోజ్..!
సెక్స్ రాకెట్ నడుపుతున్న మోడల్ని అరెస్ట్ చేసిన పోలీసులు