గురువారం 13 ఆగస్టు 2020
Cinema - Jul 11, 2020 , 18:48:22

వంశీపైడిపల్లికి మెగా హీరో గ్రీన్‌సిగ్నల్‌

వంశీపైడిపల్లికి మెగా హీరో గ్రీన్‌సిగ్నల్‌

‘మహర్షి’ తరువాత మరోసారి మహేష్‌బాబుతో సినిమా వుంటుందని భావించిన దర్శకుడు వంశీపైడిపల్లికి మహేష్‌బాబు హ్యాండిచ్చి పరశురామ్‌తో ‘సర్కారు వారి పాట’కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. దీంతో వంశీ పైడిపల్లి హీరో వేటలో పడ్డాడు. ఎన్టీఆర్‌, బన్నీ, ఇలా పలువురు కథానాయకులతో చర్చలు జరిపినా సఫలం కాలేదు. ఎట్టకేలకు మెగాహీరో రామ్‌చరణ్‌ను ఓ డిఫరెంట్‌ కమర్షియల్‌ కథతో వంశీ కన్వీన్స్‌ చేశాడని తెలిసింది.

గతంలో వీరిద్దరి కలయికలో దిల్‌ రాజు నిర్మించిన ‘ఎవడు’ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మళ్లీ ఈ ఇరువురి కలయికలో ఓ వైవిధ్యమైన కథతో ఓ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ రానుందని సమాచారం. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌తో కలిసి దిల్‌రాజు నిర్మిస్తారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo