Kuberaa | శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ నటుడు ధనుష్, టాలీవుడ్ నటుడు నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కుబేర (Kuberaa).
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మల్టీ లింగ్వెల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 20, 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా విజయవంతం కావాలని చిత్ర నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కలుసుకున్నారు. సినిమా విజయం కోసం ఆయన ఆశీస్సులు కోరగా, చిరంజీవి గారు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Our producers met Megastar @KChiruTweets garu and took his blessings ahead of the grand release on June 20th 🙏✨
When the man himself blesses the journey, greatness awaits ❤️🔥#Kuberaa in cinemas June 20, 2025.#SekharKammulasKuberaa #KuberaaOn20thJune pic.twitter.com/nS1FbbWsle
— Kuberaa Movie (@KuberaaTheMovie) June 8, 2025