Guntur kaaram Movie | మహేష్ సరసన మాజీ మిస్ ఇండియా.. గుంటూరు కారంకు అసలైన ఘాటు ఇప్పుడొచ్చింది..!
Guntur kaaram Movie Second Heroine | అప్పుడెప్పుడో ఏడాదినర్ధం క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకున్న గుంటూరు కారం ఇప్పటికీ సగం షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకోలేదు. ఆది నుంచి ఈ సినిమాకు ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. రెండు షెడ్యూల్స్ తర్వాత ఏకంగా కథనే మార్చారంటే ఇదెక్కడి విడ్డూరం అనిపించింది.
Guntur kaaram Movie Second Heroine | అప్పుడెప్పుడో ఏడాదినర్ధం క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకున్న గుంటూరు కారం ఇప్పటికీ సగం షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకోలేదు. ఆది నుంచి ఈ సినిమాకు ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. రెండు షెడ్యూల్స్ తర్వాత ఏకంగా కథనే మార్చారంటే ఇదెక్కడి విడ్డూరం అనిపించింది. ఆ తర్వాత మహేష్‌బాబు ఫ్యామిలీలో విషాదాలు, వెకేషన్లు ఇలా చూస్తుండగానే నెలలు నెలలు గడిచిపోయాయి. ఎట్టకేలకు ఈ ఏడాది కలిసొచ్చి నిర్విరామంగా షూటింగ్ జరుతుందనగా మళ్లీ థమన్ తప్పుకున్నాడు, పూజా తప్పుకుందని వార్తలతో మరోసారి గుంటూరు కారం హాట్ టాపిక్ అయిపోయింది.
ఇప్పటికే ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా లేదా అనే డౌట్.. అంతలో ఇలా ఒక్కొక్కరు తప్పుకుంటే ఇక సంక్రాంతి సంగతి దేవుడికే తెలియాలి అనే విధంగా అయిపోయింది. అయితే ఇటీవలే థమన్ ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నట్లు నాగవంశీ క్లారటీ ఇచ్చేశాడు. కానీ పూజా విషయంలో మాత్రం క్లారిటీ లేదు. పూజా కూడా క్రియేటీవ్ డిఫెరెన్సెస్ రావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని ఆమె సన్నిహితులు చెప్పారు. ఇక ఇప్పుడు ఆమె ప్లేస్‌ను శ్రీలీల ఆక్యూపై చేసింది. సెకండ్ హీరోయిన్గా ప్రాజెక్ట్‌లోకి వచ్చిన శ్రీలీల కాస్త మెయిన్ లీడ్‌గా ఫిక్సయిపోయింది. ఇక శ్రీలీల పాత్రను ఎవరు చేస్తారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ మధ్య త్రివిక్రమ్‌కు ఫేవరెట్ హీరోయిన్గా మారిన మలయాళ భామ సంయుక్త పేరు బలంగా వినిపించింది కానీ.. ఆమెను కాకుండా ఎవరూ ఊహించిన ఓ అమ్మాయిని ఈ పాత్రకు ఎంచుకున్నట్లు సమాచారం.
ఇక సెకండ్ హీరోయిన్గా ఖిలాడీ, హిట్-2 వంటి సినిమాలతో మెప్పించిన మీనాక్షీ చౌదరినీ చిత్రయూనిట్ ఎంపికచేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై మరో రెండు, మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే నిజమైతే మీనాక్షీకి బంపర్ లాటరీ తగిలినట్లే. హిట్-2 తర్వాత సినిమాలే లేని మీనాక్షీకి ఏకంగా మహేష్ సినిమాలో ఆఫర్ రావడం అంటే విశేషం అనే చెప్పాలి. వచ్చే నెలలో మొదలు కానున్న షెడ్యూల్లో మీనాక్షీ పాల్గొననుందట. ఇకపై ఎలాంటి ఆలస్యం చేయకుండా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఎట్టిపరిస్థుల్లో సంక్రాంతికే సినిమాను దింపాలని ఫిక్సయ్యారట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

