Meenakshi| గత ఏడాది నుంచి మీనాక్షి చౌదరి పేరు తెగ మారుమ్రోగిపోతుంది. ఈ అమ్మడు గుంటూరు కారం, గోట్ లాంటి భారీ చిత్రాల్లో నటించింది. లక్కీ భాస్కర్ చిత్రంతో సంచలన విజయం తన ఖాతాలో వేసుకుంది. ఇలా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న మీనాక్షి ఈ ఏడాది ఆరంభంలో ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నాలుగేళ్ల క్రితమే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఇప్పుడు ఈమెకి అదృష్టం దక్కింది. వరుస హిట్స్, చేతి నిండా సినిమాలతో ఈ అమ్మడి క్రేజ్ ఓ రేంజ్‌కి వెళ్లింది.
ప్రస్తుతం మీనాక్షి చేతినిండా సినిమాలు ఉన్నాయి. కొన్ని ఇప్పటికే సెట్స్ మీద ఉంటే, మరికొన్ని సినిమాలని త్వరలో అనౌన్స్ చేయనున్నారు. అయితే మీనాక్షి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటుంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరో వైపు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, బ్రాండ్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. అయితే నేడు నేడు మీనాక్షి చౌదరి పుట్టిన రోజు కావడంతో కొంతమంది ఆమె ఫ్యాన్స్ ఆమెకు సర్ ప్రైజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఫ్యాన్స్ కోరిక మేరకు మీనాక్షి చౌదరి బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొంది. ఇక ఆమె రాకతో అభిమానులు పేపర్ బ్లాస్ట్ లతో, అరుపులతో తెగ హంగామా చేసారు
ఇక ఆ తర్వాత మీనాక్షి చౌదరి మాట్లాడి కేక్ కట్ చేసింది. అయితే అంతమంది ఫ్యాన్స్ తనపై చూపించిన ప్రేమకు ఎమోషనల్ అయిన మీనాక్షి థ్యాంక్స్ చెబుతూ కన్నీరు పెట్టుకుంది. తన బర్త్ డే ని ఫ్యాన్స్ అంతా కలిసి ఇలా సెలబ్రేట్ చేయడంతో మీనాక్షి చౌదరి సంతోషం వ్యక్తం చేస్తూ ఎమోషనల్ అయింది. 1997 మార్చి 5న హర్యానాలోని పంచకులాలో ఓ పంజాబీ ఫ్యామిలీలో జన్మించిన మీనాక్షి చౌదరి. ఆమె తండ్రి బి.ఆర్. చౌదరి భారత సైన్యంలో కల్నల్‌గా పని చేస్తూ వీరమరణం పొందారు. ఆర్మీ స్కూల్ లో చదువుతున్నప్పటి నుంచే స్పోర్ట్స్ లో రాణించింది. ఆమె స్టేట్ లెవెల్ స్విమ్మర్ మాత్రమే కాదు, బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. అలానే డెంటల్ కోర్స్ పూర్తి చేసి, మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది.. ఫెమినా మిస్ ఇండియా హర్యానా టైటిల్ కూడా గెలుచుకుంది.