Vishnu Vardhan | తమిళ దర్శకుడు, పంజా ఫేమ్ విష్ణు వర్థన్ (Vishnu Vardhan) గురించి పత్యేక పరిచయం లేదు. బిల్లా, ఆరంభం, సర్వం, షేర్షా సినిమాలతో తనకంటూ స్టార్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు పవన్ కళ్యాణ్‌తో పంజా అనే సినిమా తెరకెక్కించి పవన్ అభిమానులకు మర్చిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చాడు. అయితే చాలా రోజుల తర్వాత విష్ణు దర్శకత్వంలో వస్తున్న చిత్రం ప్రేమిస్తావా. తమిళ దర్శకుడు శంకర్ కూతురు అదితి, ఆకాశ్ మురళి ప్రధాన పాత్రల్లో వస్తుండగా.. శరత్ కుమార్, ఖుష్భు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గోన్న దర్శకుడు విష్ణు వర్థన్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
విష్ణు మాట్లాడుతూ.. మద్రాస్‌లో నేను మహేశ్ బాబు క్లాస్మేట్స్ మాత్రమే కాదు. బెంచ్‌మేట్స్ కూడా. ఒక్కసారి నాకు క్వశ్చన్ పేపర్స్ బ్లాక్‌లో దొరుకుతున్నాయని తెలిస్తే.. ఆ విషయం మహేశ్‌కి వెళ్లి చెప్పాను. ఎక్కడ పదా అంటూ మహేశ్ నాతో వచ్చాడు. అయితే క్వశ్చన్ పేపర్స్ కొన్న తరువాత చూస్తే.. అవి డూప్లికేట్ అని తెలిసింది అంటూ విష్ణు వర్థన్ చెప్పుకోచ్చాడు. మహేశ్‌తో మూవీ ఎప్పుడు అని అడుగగా.. మేం మిత్రులుగానే ఉన్నాం కానీ ఎప్పుడు సినిమాల గురించి ఆలోచించలేదు. ఫ్యూచర్లో కుదిరితే తప్పకుండా చేస్తాం అంటూ విష్ణు చెప్పుకోచ్చాడు.