యువహీరో వరుణ్‌తేజ్ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మట్కా’. ‘పలాస’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కరుణకుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. రజనీ తాళ్లూరి, డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల నిర్మాతలు. హై బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 19 నుంచి మొదలుకానుంది. ఇందుకోసం హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో మ్యాసీవ్ సెట్‌ను మేకర్స్ నిర్మించారు. నటుడిగా వరుణ్ కెరీర్లో ఈ సినిమా ఓ చాలెంజింగ్ మూవీ ఇదని, ఇందులో ఆయన నాలుగు డిఫరెంట్ గెటప్పుల్లో కనిపించనున్నారని మేకర్స్ తెలిపారు. దేశాన్ని కదిలించిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా డిఫరెంట్ టైమ్స్‌లో సెట్ చేయబడిన కథ ఇదని, త్వరలో మరిన్ని వివరాలతో మీ ముందుకొస్తామని మేకర్స్ తెలిపారు. నోరా ఫతేహీ, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో నవీన్‌చంద్ర, అజయ్‌ఘోష్, కన్నడ కిశోర్, రవీంద్రవిజయ్, పి.రవిశంకర్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఏ.కిశోర్‌కుమార్, సంగీతం: జివీ ప్రకాశ్‌కుమార్, నిర్మాణం: వైర ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్.