Dongalunnaru Jaagratha Movie | కారులో చిక్కుకుపోయిన శ్రీ సింహా.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘దొంగలున్నారు జాగ్రత్త’ ట్రైలర్
Dongalunnaru Jaagratha Movie Trailer | స్వర మాంత్రికుడు ఎమ్.ఎమ్ కీరవాణి తెలుగు చిత్ర సీమలో గొప్ప సంగీత దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఈయన చిన్న కొడుకు శ్రీసింహా హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. శ్రీ సింహా 'యమదొంగ' సినిమాతో ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు.
Dongalunnaru Jaagratha Movie Trailer | స్వర మాంత్రికుడు ఎమ్.ఎమ్ కీరవాణి తెలుగు చిత్ర సీమలో గొప్ప సంగీత దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. డివోషనల్ సినిమాలకు ఈయన కేరాఫ్ అడ్రస్. ఈయనకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు కాలభైరవ సింగిర్గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. చిన్న కొడుకు శ్రీసింహా హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. శ్రీ సింహా ‘యమదొంగ’ సినిమాతో ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. జూ.ఎన్టీఆర్ చిన్నప్పటి క్యారెక్టర్లో నటించి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడు అవుదామని ఉద్ధేశంతో సుకుమార్ దగ్గర ‘రంగస్థలం’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అయితే అనూహ్యంగా హీరో అవతారమెత్తి ‘మత్తు వదలరా’ చిత్రాన్ని చేశాడు. మొదటి సినిమాతోనే నటుడుగా గొప్ప ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆ తర్వాత ‘తెల్లవారితే గురువారం’ ఎప్పుడు వచ్చిందో కూడా ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సతీష్ త్రిపుర దర్శకత్వం వహించాడు.
ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే ఓ కారును దొంగలించే క్రమంలో డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చుంటాడు. కాసేపటి తర్వాత డోర్ ఓపెన్ చేస్తే రాదు. ఎంత ప్రయత్నించినా డోర్ ఓపెన్ అవక, కార్లోనే ఇరుక్కుపోతాడు. కార్లో నుండి బయటకు వచ్చాడా? వస్తే ఎలా వచ్చాడు? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ట్రైలర్ మొత్తం ఆసక్తికరంగా సాగింది. కాలభైరవ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్ ఫీల్‌ను కలిగిస్తుంది. సర్వైవల్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. సముద్రఖని కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 23న విడుదల కానుంది.
Read Also:
The Ghost Movie | ప్రోమోనే ఈ రేంజ్లో ఉంటే.. ఫుల్సాంగ్ ఇంకా ఎలా ఉంటుందో..!
Chiru156 Movie | చిరు-వెంకీ కుడుముల ప్రాజెక్ట్ కాన్సిల్ అయిందా?
Dasara Movie | భారీ ధరకు నాని ‘దసరా’ థియేట్రికల్ రైట్స్?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

