Riteish Deshmukh | బాలీవుడ్ అడల్ట్ కామెడీ ఫ్రాంచైజీ ‘మస్తీ’ (Masti) నుంచి మరో కొత్త చిత్రం రాబోతుంది. బాలీవుడ్ హీరోలు రితేశ్ దేశ్ముఖ్, వివేక్ ఒబెరాయ్, ఆఫ్తాబ్ శివదాసాని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మస్తీ 4’. ఈ సినిమాకు మిలన్ జవేరి దర్శకత్వం వహిస్తుండగా.. శ్రేయ శర్మ, రూహి సింగ్, ఎల్నాజ్ నోరౌజి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్ను విడుదల చేసింది చిత్రయూనిట్. కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ ట్రైలర్ ప్రస్తుతం ఆకట్టుకుంటుంది.