ప్రముఖ మలయాళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ షాజీ కరుణ్ (73) సోమవారం కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ‘పిరవి’ (1988) చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శింపబడి ప్రశంసలందుకుంది. స్వాహం, వానప్రస్థం, నిషాద్, స్వపానమ్, వూలు, కుట్టి శ్రాంక్, వంటి చిత్రాలు దర్శకుడిగా ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ‘వానప్రస్థం’ చిత్రం మూడు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులో నటించిన మోహన్‌లాల్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. మమ్ముట్టితో ఆయన తీసిన ‘కుట్టి శ్రాంక్’ సైతం ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డు గెలుచుకుంది. షాజీ కరుణ్‌ను భారత ప్రభుత్వం 2011లో పద్మశ్రీతో సత్కరించింది. ఆయన మృతిపట్ల పలువురు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.