Jr Ntr – Vishwak Sen | టాలీవుడ్ స్టార్ నటుడు ఎన్టీఆర్‌కు యువ హీరో మాస్కా దాస్ విశ్వక్ సేన్ అభిమాని అన్న విషయం తెలిసిందే. తారక్‌కు చిన్నప్పటినుంచే వీరాభిమాని అయిన విశ్వక్ సేన్.. తన సినిమాలతో మాస్ లో మంచి ఇమేజ్ ని సంపాదించుకుంటూ ముందుకు వెళ్తూనే, నందమూరి ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానాన్ని కూడా అందుకుంటున్నారు. అయితే తాజాగా ఈ నటుడు ఎన్టీఆర్‌ను కలుసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను విశ్వక్ సేన్ ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. ఈ ఫొటోకు ‘లవ్ యూ తారక్ అన్న’ అంటూ రాసుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. తారక్ ప్రస్తుతం కొరటల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. రెండు భాగాలుగా తెరకుక్కుతున్న ఈ చిత్రంనుంచి మొదటి పార్ట్ దసరా కానుకగా 2024 అక్టోబర్ 10న విడుదల కానుంది. మరోవైపు విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో నటిస్తుండగా ఈ చిత్రం ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.
Love you anna @tarak9999 pic.twitter.com/DhdmstRkBe
— VishwakSen (@VishwakSenActor) April 3, 2024