పౌరాణిక కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఘటోత్కచుడి కుమారుడైన బార్బరికుడి నేపథ్యంలో ఈ సినమా రాబోతున్నది. సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహా, సాంచి రాయ్, సత్యం రాజేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ పతాకంపై విజయపాల్ రెడ్డి అదిధాల నిర్మిస్తున్నారు.
బుధవారం మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఏకకాలంలో మూడు బాణాలు వేయడంలో బార్బరికుడు నేర్పరి అని, అందుకే టైటిల్లో త్రిబాణధారి అని పెట్టామని, పౌరాణిక, సమకాలీన అంశాల మేళవింపుతో ఆకట్టుకునే వినూత్న కథాంశమిదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కుశేందర్ రమేష్ రెడ్డి, సంగీతం: ఇన్ఫ్యూషన్ బ్యాండ్, సమర్పణ: మారుతి టీమ్ ప్రొడక్ట్, రచన-దర్శకత్వం: మోహన్ శ్రీవత్స.