‘ఓ ఇండిపెండెంట్ అమ్మాయి, సాఫ్ట్వేర్ అబ్బాయి మధ్య సాగే ప్రేమకథే ‘మార్కెట్ మహాలక్ష్మీ’. ఈ సినిమాలో మేం ఓ కొత్త విషయాన్ని చెప్పాం. అదేంటో సినిమా చూసే తెలుసుకోవాలి.’ అంటున్నారు నిర్మాత అఖిలేశ్ కలారు. ఆయన నిర్మించిన చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మీ’. పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా నటించారు. వీఎస్ ముఖేష్ దర్శకుడు. ఆయనే ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు కూడా అందించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా నిర్మాత విలేకరులతో ముచ్చటించారు. ‘ఇందులో నటించిన నటీనటులందరూ తన పాత్రలకు వందశాతం న్యాయం చేశారు. పార్వతీశం, ప్రణీకాన్విక అయితే జీవించారు. వారి కెమిస్ట్రీ తెరపై చాలా బావుంటుంది. ఇక దర్శకుడు ముఖేష్ అయితే.. చెప్పిన దానికంటే అద్భుతంగా తీశాడు. బాక్సాఫీస్ విజయాన్ని ఈ సినిమా సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాను.’ అని నమ్మకం వ్యక్తం చేశారు అఖిలేశ్. మరిన్ని మంచి సినిమాలను నిర్మించి, అభిరుచిగల నిర్మాత అనిపించుకోవడం తన ధ్యేయమని అఖిల్ చెప్పారు.