March Second Week Telugu Movie Releases | డ్రై నెలగా పిలవబడే ఫిబ్రవరి ఈ సారి ఇండస్ట్రీకి బాగానే గిట్టుబాటు అయింది. రైటర్ పద్మభూషణ్, సార్, వినరో భాగ్యము విష్ణుకథ వంటి సినిమాలు నిర్మాతలకు కాసుల వర్షాన్నే కురిపించాయి. మరీ అన్నీ బ్లాక్బస్టర్లు అనలేం కానీ, పర్వాలేదనిపించే హిట్లుగా నిలిచాయి. ఇక గతకొంత కాలంగా తెలుగులో మార్కెట్‌ను పెంచుకోవాలనుకున్న ధనుష్‌కు.. ‘సార్’తో ఆ ముచ్చట తీరిపోయింది. ఓటీటీ హిట్ రుచి చూసిన సుహాస్ సైతం ‘రైటర్’తో పది కోట్ల మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. హ్యాట్రిక్ ఫ్లాప్‌లతో సతమతమవుతున్న కిరణ్‌కు ‘వినరో భాగ్యము’ కాస్త ఊరటనిచ్చింది. ఇక మార్చి తొలివారంలో ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ‘బలగం’.. బాక్సాఫీస్ దగ్గర తిరుగలేని విజయాన్ని సాధించింది. రోజు రోజుకు ఈ సినిమాకు టిక్కెట్లు తెగుతునే ఉన్నాయి. ఇక రెండో వారం కూడా సినీ ప్రేమికులను ఎంటర్టైన్ చేయడానికి అటు థియేటర్, ఇటు ఓటీటీలు ముస్తాబవుతున్నాయి. మరీ మార్చి రెండో వారంలో విడుదలయ్యే సినిమాలేంటో ఓ లుక్కేద్ధాం.
థియేటర్లో రిలీజయ్యే సినిమాలు:
సీ.ఎస్.ఐ సనాతన్:
క్రేజ్ ఎలా ఉన్నా ఆది సాయికుమార్ మాత్రం వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సీ.ఎస్.ఐ సనాతన్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రివ్యూలు కూడా పాజిటీవ్ గానే వస్తు్న్నాయి. మరీ కమర్షియల్‌గా ఈ సినిమా ఆదికి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి మరి.
ట్యాక్సీ:
వసంత్,అల్మస్ మోతివాలా,సూర్య,సౌమ్య మీనన్ జంటగా నటిస్తున్న ట్యాక్సీ మూవీ శుక్రవారం రిలీజైంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను హర్ష దర్శకత్వం వహించాడు.
నేడే విడుదల:
అసీఫ్‌ఖాన్, మౌర్యానీ జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆన్లైన్ ఫిలిం పైరసీ అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. రామ్ రెడ్డి పన్నాలా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
వీటితో పాటుగా ‘వాడెవడు’, ‘జంతుప్రపంచం’ సినిమాలు కూడా శుక్రవారం రిలీజైయ్యాయి.
ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు/వెబ్ సిరీస్‌లు:
నెట్ ఫ్లిక్స్:
రానా నాయుడు – మార్చి 10
రేఖ(మలయాళం మూవీ) – మార్చి 10
ది గ్లోరీ(హాలీవుడ్ వెబ్ సిరీస్) – మార్చి 10
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
యాంగర్ టేల్స్ – మార్చి 9
చాంక్ కెన్ డంక్(హాలీవుడ్ మూవీ) – మార్చి 10
రన్ బేబీ రన్ (తెలుగు & తమిళ్ ) – మార్చి 10
అమెజాన్ ప్రైమ్:
హ్యాపీ ఫ్యామిలీ- కండిషన్స్ అప్లై (హిందీ వెబ్ సిరీస్) – మార్చి 10
జీ5:
రామ్ యో(కన్నడ) – మార్చి 10
బొమ్మై నాయగి(తమిళ్) – మార్చి 10
బౌడీ క్యాంటీన్(బంగ్లా) – మార్చి 10
సోనీ లివ్:
యాక్సిడెంటల్ ఫార్మర్ అండ్ కో(తమిళ్) – మార్చి 10
క్రిస్టీ(మలయాళం) – మార్చి 10
బ్యాడ్ ట్రిప్ – మార్చి 10.