Devara Movie | ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న తాజా చిత్రం ‘దేవర’(Devara). కొరటాల శివ (Koratala Shiva) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీదేవి గారలపట్టి జాన్వీకపూర్ (Janvi kapoor) ‘దేవర’తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. పోర్ట్ మాఫియా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ నుంచి అదిరిపోయే గ్లింప్స్‌ను షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. కాగా దేవర పార్టు 1 ముందుగా నిర్ణయించిన ప్రకారం ఏప్రిల్ 5న విడుదల కావడం లేదన్న విషయం తెలిసిందే. సైఫ్ అలీఖాన్‌కు గాయం కావడంతో ఈ మూవీ షూటింగ్‌ను కొద్దిరోజులు నిలిపివేశారు. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ న్యూస్ వైరల్ అవుతుంది.
ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే జాన్వీ కాకుండా మరో కొత్త కథనాయిక ఈ సినిమా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంతో మరాఠీ హీరోయిన్ శ్రుతి మరాటే (Shrutii Marrathe) టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్రయూనిట్ స్పందించాల్సి ఉంది. ఇక మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.