హీరోయిన్ మానుషీ చిల్లర్కు అరుదైన అవకాశం దకింది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగస్వామిగా ఆమె మారబోతున్నది. వరల్డ్ హెల్త్ డే, వరల్డ్ ఇమ్యూనైజేషన్ వీక్ సందర్భంగా ప్రచారం కోసం మానుషీ చిల్లర్ ఎంపికైంది. 2017లో ప్రపంచ సుందరి కిరీటం గెల్చుకున్న మానుషీ..ఆ తర్వాత నాయికగా బాలీవుడ్ లో తెరంగేట్రం చేసింది. అక్షయ్ కుమార్ సరసన ‘పృథ్వీరాజ్’ చిత్రంలో నటిస్తున్నది. పరిశుభ్రత, ఇమ్యూనైజేషన్, కొవిడ్, హెచ్ఐవీ..ఇలా అనేక అంశాల మీద యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ పోగ్రాం ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. ఈ ప్రచార కార్యక్రమాల్లో మానుషీ చిల్లర్ కనిపించనుంది. తనకొచ్చిన అరుదైన అవకాశంపై మానుషీ చిల్లర్ స్పందిస్తూ…‘యూఎన్డీపీ ప్రచారంలో భాగమైనందుకు గర్వంగా ఉంది. తక్షణం ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఎన్నో అంశాలున్నాయి. వాటిని బాగా ప్రచారం చేసేందుకు నా వంతుగా పూర్తి ప్రయత్నం చేస్తా’ అని చెప్పింది.