Joram Movie | నార్త్‌తో పాటు సౌత్‌లో కూడా మంచి పాత్రలతో తనదైన గుర్తింపు పొందిన నటుడు మనోజ్ బాజ్‌పాయి (Manoj Bajpayee). తన కెరీర్ గ్రాఫ్ పడిపోతుంది అనే టైంలో ఫ్యామిలీ మ్యాన్ , ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై (Sirf Ek Bandaa Kaafi Hai)’ వంటి చిత్రాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇక ఈ సినిమాలు ఇచ్చిన జోష్‌తో మనోజ్ నటిస్తున్న తాజా చిత్రం జోరం. దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల వద్ద నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ గమనిస్తే.. మనోజ్ వాజ్‌పేయి ఇందులో ఒక మావోయిస్టుగా నటించనున్నట్లు తెలుస్తుంది. మావోయిస్టు అయిన మనోజ్‌పై షూట్ ఎట్ సైట్ ఉండగా.. అతడిని తన ముడు నెలల కుమార్తెను రక్షించుకునేందుకు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళుతున్నట్లు ట్రైలర్లో కనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో స్మితా తాంబే, జీషన్ అయ్యూబ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. జీ స్టూడియోస్, మఖిజా ఫిల్మ్‌ల బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.