మనోజ్, చాందిని జంటగా నటించిన చిత్రం ‘14డేస్ లవ్’. నాగరాజు బోడెం దర్శకత్వం వహిస్తున్నారు. హరి బాబు దాసరి నిర్మాత. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘కుటుంబ విలువలను కాపాడే ప్రయత్నంలో ఓ ఇంటి వారసులు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? ఓ ప్రేమజంట కథకు ఎలాంటి ముగింపు దొరికింది? అనే ఆసక్తికరమైన అంశాల చుట్టూ కథ నడుస్తుంది.
ఫ్యామిలీ, సెంటిమెంట్, వినోదంతో ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: కన్నన్ మునుస్వామి, సంగీతం: కిరణ్ వెన్న, మాటలు: గౌరీశ్వర్, శివప్రసాద్ సామల, దర్శకత్వం: నాగరాజు బోడెం.