Maniratnam’s next film | దిగ్గజ తమిళ దర్శకుడు మణిరత్నం తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన యువ హీరో నవీన్ పొలిశెట్టితో మణి తన తర్వాత ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం మణిరత్నం విశ్వనటుడు కమల్ హాసన్‌తో కలిసి ‘థగ్ లైఫ్’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పనులు ముగిసిన వెంటనే నవీన్ పొలిశెట్టితో తన తర్వాతి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే అవకాశం ఉంది. ఈ క్రేజీ కాంబినేషన్ టాలీవుడ్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. తన సహజమైన నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టికి మణిరత్నం వంటి దిగ్గజ దర్శకుడితో పనిచేయడం ఒక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు ఎవరు చేపడతారు, అలాగే నవీన్ పొలిశెట్టి సరసన నటించే హీరోయిన్ ఎవరు అనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మణిరత్నం దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి నటించనున్న ఈ ద్విభాషా చిత్రంపై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడటానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.