చెన్నై: ‘నవరస’ తమిళ వెబ్ సిరీస్ టీజర్ రిలీజైంది. 9 మంది కథలతో నవరస పేరుతో మణిరత్నం ఓ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఆ టీజర్ కోసం వాడిన టైటిల్ ట్రాక్ కూడా ట్రెండింగ్‌లో మారుమోగుతోంది. ఈ సిరీస్‌కు ఏఆర్ రెహ్వాన్ మ్యూజిక్ అందించారు. గౌతమ్‌మీనన్, బెజోయ్ నంబియార్, కార్తిక్ సుబ్బరాజ్, కార్తిక్ నరేన్, కేవీ ఆనంద్, రతీంద్రన్ప్రసాద్, హరితాసాలిమ్, అరవిందస్వామి ఒక్కో భాగానికి దర్శకత్వ బాధ్యతల్ని తీసుకుంటున్నారు. ఆగస్టు 6వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో నవరస వెబ్ సిరీస్ ప్రారంభంకానున్నది. ఈ సిరీస్ ద్వారా వచ్చే డబ్బులను కరోనాతో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న తమిళ సినీ కార్మికులకు అందించనున్నారు. ఈ సిరీస్‌కు సంబంధించిన తొలి పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. ఇందులో హీరో సూర్య, కథానాయిక ప్రయాగరోజ్ మార్టిన్లు ఉన్నారు. సూర్య నటించిన ఈ ఎపిసోడ్‌కు గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహించారు.
Makkale, ungaloda superstars ellarum kadha solla varanga! #Navarasa from 6th August!#ManiSir @JayendrasPOV @Suriya_offl @VijaySethuOffl @Actor_Siddharth @thearvindswami @nambiarbejoy @menongautham @karthicknaren_M @karthiksubbaraj @priyadarshandir pic.twitter.com/eji6XMRKUF
— Netflix India South (@Netflix_INSouth) July 9, 2021