చిత్ర పరిశ్రమలో సరికొత్త అధ్యాయానికి తెరదించబోతున్నారు కోలీవుడ్ అగ్ర దర్శకులు. ఒకవైపు భారీ బడ్జెట్‌తో సినిమాలు నిర్మిస్తున్న మణిరత్నం, శంకర్ ఇప్పుడు ఏఆర్ మురుగదాస్, గౌతమ్ మీనన్, వెట్రిమారన్, లింగుస్వామి, మిస్కిన్, శశి, వసంతబాలన్, లోకేశ్ కనగరాజ్, బాలాజీ శక్తివేల్ వంటి దర్శకులతో కలిసి ‘రెయిన్ ఆన్ ఫిల్మ్స్’ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ఆరంభించారు.
ఈ నిర్మాణ సంస్థ ద్వారా థియేటర్స్,ఓటీటీతో పలు ఫ్లాట్‌ఫాంలకు మంచి సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందించాలని అనుకుంటున్నారు.అలానే కొత్త మేకర్స్‌కి అవకాశం ఇవ్వాలన్నదే ఈ నిర్మాణ సంస్థ సంకల్పం. తొలి ప్రాజెక్ట్‌కి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ దర్శకుడు కమల్ తో విక్రమ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఇది పూర్తయ్యాక ‘రెయిన్ ఆన్ ఫిల్మ్స్’ బేనర్లో చేసే సినిమాని ఆరంభిస్తారు
నూతన ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోవెల్లడించనున్నారు. ఇక శంకర్ విషయానికి వస్తే త్వరలో ఆయన రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేయనున్నాడు. పాన్ ఇండియా మూవీగాఈ చిత్రంరూపొందనుంది.ఇక మణిరత్నం పలువురు స్టార్స్‌తో పొన్నియన్ సెల్వన్ అనే సినిమా రూపొందిస్తున్నాడు.