Manchu Vishnu | ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణస్వీకారం
Manchu Vishnu | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( MAA ) అధ్యక్షుడిగా మంచు విష్ణు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. మంచు విష్ణు, ఆయన ప్యానెల్ సభ్యుల చేత మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఫిల్మ్

హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడిగా మంచు విష్ణు ( Manchu Vishnu ) శనివారం ప్రమాణస్వీకారం చేశారు. మంచు విష్ణు, ఆయన ప్యానెల్ సభ్యుల చేత మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన ఈ వేడుకకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మోహన్ బాబు, నరేశ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మంచు విష్ణు, మోహన్ బాబు ఆశీస్సులు తీసుకున్నారు. అయితే విష్ణు ప్యానెల్ నుంచి గెలుపొందిన రఘుబాబు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. విష్ణు ప్యానెల్ నుంచి రఘు బాబు ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారు.
ఈ నెల 10న మా జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాశ్ రాజ్‌పై 107 ఓట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (‘మా’ )అధ్యక్షుడిగా మంచు విష్ణు 13వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పెన్షన్ల ఫైలుపై తొలి సంతకం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

