Prabhas | మంచు విష్ణు టైటిల్ రోల్‌ని పోషిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్‌లాల్, మోహన్‌బాబు, ప్రభాస్ వంటి అగ్ర తారలు భాగమవుతున్నారు. ప్రభాస్ శివుడి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల న్యూజిలాండ్‌లో లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం ఇండియాకు తిరిగొచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ నెల రెండోవారంలో మొదలయ్యే తాజా షెడ్యూల్లో ప్రభాస్ జాయిన్ కాబోతున్నట్లు తెలిసింది.
భారీ స్థాయిలో తీర్చిదిద్దిన సెట్లో ప్రభాస్‌పై కీలక ఘట్టాలను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. తన పాత్ర కోసం ప్రభాస్ ఇప్పటికే కసరత్తులు పూర్తి చేశారని, ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ఆయన పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. అతిథి పాత్ర అయినా కథాగమనంలో కీలకంగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కీ’ ‘రాజా సాబ్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.