Manchu Vishnu | టాలీవుడ్ హీరో మంచు విష్ణు కన్నప్ప షూటింగ్లో గాయపడ్డాడు. ప్రస్తుతం కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్‌లో జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ స్పాట్లో ఓ డ్రోన్ కెమెరా అదుపుతప్పి విష్ణు మీదకు రావడంతో ఆయన చేతికి గాయాలయ్యాయని సమాచారం. వెంటనే చిత్ర యూనిట్ అప్రమత్తమై విష్ణను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారట. ఈ ఇన్సిడెంట్‌తో కన్నప్ప షూటింగ్‌కు కొన్ని రోజుల పాటు బ్రేకులు పడే చాన్స్ ఉంది.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహాభారతం టెలివిజన్ షోకు దర్శకత్వం వహించిన ముకేష్ కుమార్ సింగ్ రూపొందిస్తున్నాడు. సినిమా మొదలైనప్పుడు పెద్దగా అంచనాల్లేవు కానీ.. ప్రభాస్, నయనతార, మోహన్‌లాల్ ఇలా మేటి దిగ్గజాలంతా సినిమలో కీలకపాత్రలు చేస్తుండటంతో ఒక్క సారిగా ఎక్కడేలేని హైప్ వచ్చింది. ఇక ఈ సినిమా బడ్జెట్ వంద కోట్లకు పైమాటే అని తెలుస్తుంది. మైథలాజికల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాను మోహన్‌బాబు నిర్మిస్తున్నాడు.
పరచూరి గోపాలకృష్ణ, సాయిమాధవ్ బుర్ర, తోట ప్రసాద్ వంటి మేటి రచయితలు ఈ సినిమాకు పనిచేస్తున్నారు. విజువల్స్ పరంగానూ, టెక్నికల్ పరంగానూ ఈ సినిమాను హై స్టాండర్డ్స్‌లో రూపొందిస్తున్నారట. ఈ సినిమాలో భక్త కన్నప్ప గొప్పతాన్ని ఈ తరానికి చూపించబోతున్నారట. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి వంటి స్టార్ క్రూ ఈ సినిమాలో భాగం కానుంది. వీలైనంత త్వరగా షూటింగ్‌ను పూర్తి చేసి ఆపై గ్రాఫిక్స్ కోసం ఎక్కువ టైమ్ కేటాయించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.