Kannappa | మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం కన్నప్ప. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రభాస్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శివ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ సినిమా విజయం సాధించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు మోహన్ బాబు. ఈ క్రమంలోనే మూవీ విడుదలైన అనంతరం వచ్చిన ట్రోల్స్‌పై మోహన్ బాబు తాజాగా స్పందించారు.
సినిమాకు విమర్శ – సద్విమర్శ, ప్రకృతి- వికృతి ఇలా రెండూ ఉంటాయి. ఒక గొప్ప పండితుడు వేద శాస్త్రాల గురించి తెలిసిన అతడు మాట్లాడుతూ నాతో ఇలా అన్నారు. మోహన్‌బాబుగారు, జరిగేదంతా చూస్తున్నాను. గత జన్మలో కానీ, ఈ జన్మలో కానీ తెలిసి తెలియక మీరు ఏమైనా తప్పులు చేసి ఉంటే, ఇలా మిమ్మల్ని విమర్శించే వారంతా మీ కర్మను తీసుకెళ్తున్నారు. కాబట్టి వారిని ఆశీర్వదించండి. వారి గురించి నేను ఏమీ మాట్లాడను. వారు, వారి కుటుంబాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను అని మోహన్‌బాబు తెలిపారు.
#mohanbabu Garu about the #troll‘ #Trending #viralvideo #ManchuVishnu #mamchumanoj pic.twitter.com/ezXgWuuY0n
— #MY MEDIA VENKAT (@CinemaPosts) July 11, 2025