‘50ఏండ్ల నా నట ప్రస్థానంలో నేటికీ నా అభిమానులు నా వెన్నంటే ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ‘కన్నప్ప’ విజయం తర్వాత వారంతా ఫోన్లు చేసి అభినందిస్తుంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ సినిమాకోసం అంతా ప్రాణం పెట్టి పనిచేశాం. ఆ భగవంతుడి ఆజ్ఞతో తీసిన సినిమా ఇది.’ అని డా.మోహన్‌బాబు అన్నారు.
మంచు విష్ణు కథానాయకుడిగా ఆయన నిర్మించిన భక్తిరసాత్మక దృశ్యకావ్యం ‘కన్నప్ప’. ముఖేష్కమార్సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, ప్రభాస్ ప్రత్యేక పాత్రలతో అలరించిన విషయం తెలిసిందే. ఈ నెల 27న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్‌మీట్‌లో మోహన్‌బాబు మాట్లాడారు.
శివకటాక్షం వల్లే ఈ విజయం సాధ్యమైందని, ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలని మంచు విష్ణు పేర్కొన్నారు. ‘కన్నప్ప’ సినిమాపై అందరూ ప్రేమ కురిపిస్తున్నారని దర్శకుడు ముఖేష్‌కుమార్ సింగ్ చెప్పారు. ఇంకా మైత్రి శశి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ మహేశ్వరి, అర్పిత్ రంకా, శివ బాలాజీ, కౌశల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.