Manchu Manoj-Mounika Reddy Wedding Song | నెలరోజుల క్రితం మంచు మనోజ్ దివంగత నేత భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికా రెడ్డిని ఘనంగా పెళ్లిచేసుకున్నాడు. ఇరు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు సమక్షంలో వీరిపెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లికి మంచు లక్ష్మీ ఇల్లు వేదికైంది. ఇక పెళ్లి తర్వాత కూడా ఈ జంట పలు గుళ్లలో దర్శనమిచ్చారు. ఇక ఇటీవలే వెన్నెల కిషోర్ హోస్ట్‌గా చేస్తున్న అలా మొదలైంది ప్రోగ్రాంకు కూడా ఈ జంట వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఎప్పుడెప్పుడు ఫుల్ వీడియో రిలీజవుతుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే తాజాగా మనోజ్ తన పెళ్లివేడుకకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలను వీడియో సాంగ్ రూపంలో రిలీజ్ చేశాడు. ఏం మనసో.. ఏం మనసో అంటూ ఓ పాటను ఆ వీడియోకు జత చేశాడు. అచ్చు రాజమని కంపోజ్ చేసి ఆలపించిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించాడు. పెళ్లికి సంబంధించిన ముఖ్యమైన వేడుకలన్ని ఈ వీడియోలో చూపించారు. హల్దీ ఫంక్షన్, రింగులు మార్చుకోవడం సహా పెళ్లికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను చూపించారు. ఈ వీడియోలో మోహన్‌బాబు, మౌనిక రెడ్డి కళ్లు తుడవడం. హత్తుకోవడం వంటివి కాస్త ఎమోషనల్‌గా అనిపించాయి. ఇక వీడియో చివర్లో ఇది శివుని ఆజ్ఞ అంటూ మనోజ్, భూమా మౌనికారెడ్డి, ఆమె తనయుడి చేతులు ఒకరిపై ఒకరు వేసుకుని ఉండటం వీడియోకే హైలెట్‌గా నిలిచింది.