Manchu Manoj Re-entry | మంచు అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా మంచు మనోజ్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మోహన్‌బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన.. తన నటన, అభినయంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రొటీన్‌కు విభిన్న సినిమాలు చేస్తూ టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే గత కొంత కాలంగా ఈయన సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. తిరిగి మళ్లి ఈయన సినిమాల్లోకి రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈయన ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.
బ్లాక్ అండ్ వైట్‌లో మంచు మనోజ్ పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే అది సినిమాలో లుక్ అంటూ ప్రచారం జరుగుతుంది. మరీ దీనిపై మనోజ్ స్పందిస్తాడో లేదో చూడాలి. ఇక మనోజ్ గతంలో అహం బ్రహ్మస్త్ర అనే సినిమాను ప్రకటించాడు. సినిమాకు సంబంధించిన పోస్టర్లను కూడా రిలీజ్ చేశాడు. అయితే ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత మనోజ్ సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నాడు. ఇక ఈ మధ్య భూమా మౌనికా రెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని వినాయకుని మండపానికి వచ్చారు. వీరిద్ధరు కలిసి పూజాలు జరిపించడంతో పెళ్ళి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే వాటిపై ఎవరూ స్పందించలేదు. దాంతో వీరిద్ధరి పెళ్లి కన్ఫార్మ్ అయినట్లు వార్తలు మరింత జోరు అందుకున్నాయి.
Adios amigo 🙌🏽 pic.twitter.com/vSSnbL0Sxd
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 8, 2022