మరో రెండు వారాల్లో బిగ్ బాస్‌కి శుభం కార్డ్ పడనుంది. హౌజ్‌మేట్స్ అందరు టైటిల్ రేసులో నిలిచేందుకు గట్టిగా ఫైట్ చేస్తున్నారు. తాజా ఎపిసోడ్లో మానస్- ప్రియాంకల మధ్య నామినేషన్ గురించి చర్చ నడిచింది. నువ్వు కాజల్‌ని నామినేట్ చేయడం కరెక్ట్ అనుకుంటున్నావా అని మానస్.. ప్రియాంకని అడిగాడు. దానికి ప్రియాంక నాకు వేరే ఆప్షనల్ లేదని పేర్కొంది.
కాజల్‌కి నువ్ చెప్పిన రీజన్ కరెక్ట్ అని అనుకుంటున్నావా? అని అడగ్గా.. కాదని నేనే అంటున్నా కదా.. మరి నువ్ నన్ను ఎందుకు నామినేట్ చేయలేదు అని మానస్‌ని అడుగుతుంది ప్రియాంక. నేను నిన్ను ఫ్రెండ్ అని అనుకుంటున్నా కాబట్టి నిన్ను నామినేట్ చేయలేదు.. నువ్ కాజల్‌ని ఫ్రెండ్ అని అనుకోలేదు కాబట్టే నామినేట్ చేశావ్ అని అంటాడు. షణ్ముఖ్, కాజల్‌లలో నీకు సపోర్ట్ చేసింది ఎవరు పింకీ.. అని అడగుతాడు మానస్. కాజల్ అక్క అని చెప్పింది పింకీ.
షణ్ముఖ్ వలన నీకు ఏమైన ఉపయోగం జరిగిందా? నీపై కనికరం చూపించాడా? నిన్ను కెప్టెన్‌ని చేశాడా? కనీసం సేవ్ చేశాడా? అని అడుగుతాడు. దేనికీ కూడా నో అని చెప్తుంది ప్రియాంక. దీంతో మానస్ అక్కడ నుంచి లేచివెళ్లిపోతూ.. నిజమైన ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకో పింకీ అని అంటాడు. నేను మాట్లాడుతుంటే అలా లేచివెళ్లిపోతావ్ ఏంటి అని ప్రియాంక అడగ్గా.. నేను మాట్లాడాల్సింది అయిపోయింది.. అని అంటాడు. నేను మాట్లాడుతున్నాగా అని ప్రియాంక అంటే, చెప్పిందే చెబుతున్నావ్ అని అంటాడు మానస్. నాకు బాగా విలువ ఇస్తున్నావ్ థాంక్స్ అని అంటుంది పింకీ. నువ్ కూడా బాగా అర్థం చేసుకున్నావ్ అని అంటాడు మానస్.