అగ్రనటుడు చిరంజీవి నటించిన మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్‌గారు’. విక్టరీ వెంకటేశ్ ఇందులో ప్రత్యేక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. నయనతార కథానాయిక. అనిల్ రావిపూడి దర్శకుడు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానున్న సందర్భాన్ని పురస్కరించుకొని, ప్రమోషన్లో భాగంగా మంగళవారం ఈ సినిమాకు చెందిన చిరంజీవి కొత్త స్టిల్‌ని మేకర్స్ విడుదల చేశారు.
బ్లాక్ సూట్, వైట్ షర్ట్, కళ్లకు డార్క్ గ్లాసెస్‌తో ఒక చేత్తో గన్ పట్టుకొని స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్న చిరంజీవి స్టిల్ అభిమానులు పండుగ చేసుకునేలా ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు భారీగా పెంచాయని, చిరంజీవి, వెంకటేశ్ కాంబినేషన్లో తీసిన పాటను త్వరలోనే విడుదల చేయనున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: శ్రీమతి అర్చన, నిర్మాణం: షైన్ స్క్రీన్స్ అండ్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్.