Devara | యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’(Devara). జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
అయితే ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ మొదట ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అదేరోజు తమిళం నుంచి రజనీ కాంత్ వేటగాడు వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ సినిమాను రెండు వారాలు ముందుగానే తీసుకోస్తున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ.. దేవర టీం కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు కొత్త పోస్టర్ను విడుదల చేసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్, హరికృష్ణ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వరకర్త. మరోవైపు అదేరోజున పవన్ కళ్యాణ్ ఓజీ విడుదల అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించగా తాజాగా ఈ చిత్రం వాయిదా పడినట్లు తెలుస్తుంది.
Sending a Warning Notice to all coasts about his early arrival ⚠️⚠️
Man of Masses @Tarak9999‘s #Devara in cinemas from 𝐒𝐞𝐩𝐭𝐞𝐦𝐛𝐞𝐫 𝟐𝟕𝐭𝐡! 🔥🔥#DevaraOnSep27th 🌊 pic.twitter.com/j3WOyPYmX2
— Devara (@DevaraMovie) June 13, 2024