Actress Mamata Mohandas | నటి మమతా మోహన్‌దాస్ మరో అరుదైన వ్యాధితో భాదపడతున్నట్లు తెలిపింది. తనకు ‘విటిలిగో’ అనే చర్మ వ్యాధి సోకిందని ఈ మలయాళ బ్యూటీ వెల్లడించింది. ఆ వ్యాధి తన చర్మ రంగును కోల్పోయేలా చేస్తోందని క్రానిక్ ఆటో ఇమ్యూన్ దిజార్దర్ వల్ల ఈ వ్యాధి ఏర్పడినట్లు ఆమె తెలిపింది. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది. డియర్ సన్ నీ కిరణాలను చూడడానికి నీ కంటే ముందే నిద్ర లేస్తున్నాను. నీ శక్తినంతా నాకివ్వండి. ఎప్పటి రుణపడి ఉంటాను అంటూ కాఫీ కప్‌తో ఉన్న సెల్ఫీ ఫోటోను షేర్ చేసింది. దాంతో పలువురు సినీ సెలబ్రెటీలు, అభిమనులు నువ్వు ఒక ఫైటర్, ఆ వ్యాధిని జయిస్తావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలోనూ మమతా క్యాన్సర్ బారిన పడగా కీమోథెరపీ చేయించుకుని దాని నుంచి బయటపడింది.
మమతా మోహన్‌దాస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. యమదొంగ, చింతకాయల రవి, కింగ్ వంటి పలు సినిమాల్లో నటించి తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న మమతా మోహన్‌దాస్ 13ఏళ్ల తర్వాత రుద్రాంగి సినిమాతో రీ-ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. నటిగానే కాకుండా సింగర్ గానూ మమతా పలు సూపర్ హిట్ పాటలను ఆలపించింది. తెలుగులో రాఖీ, శంకర్ దాదా జిందాబాద్, కింగ్, జగడం, చందమామ సహా పలు సినిమాల్లో సూపర్ హిట్ పాటలు పాడింది.