Mammootty | మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి (Mammootty) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి అమీన (Ameena) కన్నుమూసింది. ప్రస్తుతం ఆమె వయసు 70 ఏళ్లు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అమీన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలోనే ఆరోగ్యం క్షీణించి మంగళవారం తుదిశ్వాస విడిచింది. ఆమె అంత్యక్రియలను బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కాగా, మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ (93) ఈ ఏడాది ఏప్రిల్లో మరణించిన విషయం తెలిసిందే. గతకొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఫాతిమా కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూసింది. తల్లి మరణించి ఐదు నెలలు కూడా గడవకముందే సోదరి మరణించడంతో మమ్ముట్టి కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.
మలయాళ చిత్ర సీమలో అగ్ర హీరోగా వెలుగొందుతున్న మమ్ముట్టి తెలుగులో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ‘స్వాతి కిరణం’, ‘యాత్ర’ వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరించారు. ఈ ఏడాది అక్కినేని అఖిల్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఏజెంట్’ (Agent) చిత్రంతో కీలక పాత్ర పోషించారు. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టారు. ప్రస్తుతం ‘బ్రహ్మయుగం’ (Bramayugam) అనే చిత్రంలో నటిస్తున్నారు.
Also Read..
Vadivelu | హ్యాపీ బర్త్ డే టు లెజెండరీ కమెడియన్ వడివేలు