Vicky Kaushal | బాలీవుడ్ ప్రామిసింగ్ యాక్టర్ విక్కీ కౌశల్ కెరీర్ బిగెనింగ్ నుంచి కొత్త కథలతో వస్తూ హిందీ నాట మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా.. థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని ఎప్పుడూ తాపత్రయపడుతుంటాడు. ఈ మధ్యనే ‘జర హట్కే జర బచ్కే’ సినిమాతో వచ్చి సూపర్ డూపర్ హిట్టు కొట్టాడు. ఇక ఇప్పుడు అదో జోష్‌తో ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’ అనే మరో కంటెంట్ ఓరియెంటెడ్ కథతో వస్తున్నాడు. ‘ధూమ్-3’ దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి అటెన్షన్ క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ఇంటిల్లిపాది దేవుడికి పరమ భక్తులు. తరతరాలుగా పూజలు నిర్వహించే సద్బ్రాహ్మణ పూజారులు. ఆ ఫ్యామిలీలో భక్తి పాటలు పాడే ఓ వ్యక్తి భూషణ్ కుమార్. ఓ వైపు ఇంట్లో నిష్టగా దేవుడి భక్తిడిలా ఉంటూ.. మరో వైపు ఫ్రెండ్స్‌తో దుబారాగా తిరుగుతుంటాడు. అతడి లైఫ్‌లోకి హీరోయిన్ ఎంటరవుతుంది. ఇక లైఫ్ అంతా హ్యాపీగా ఉందనుకున్న టైమ్‌లో భూషణ్ కుమార్ ముస్లిం అని తెలుస్తుంది. అప్పటివరకు భూషన్‌ను దేవుడిలా భావించిన వారు.. ఆయనపై తిరగబడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ పరిణామాల నుంచి భూషన్ కుమార్ ఎలా బయటపడ్డాడు కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్‌తో క్లారిటీ వచ్చేసింది.
కథ పరంగా మంచి విషయం ఉన్న సినిమానే. పైగా ఫన్‌తో పాటు ఎమోషనల్ హంగులు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇదే రేంజ్లో సినిమా ఉంటే మట్టుకు విక్కీ కౌషల్‌కు మరో హిట్టు ఖాయం. పైగా ఈ సినిమా వచ్చే వారం సోలోగా రిలీజ్ కాబోతుంది. ఇది ఈ మూవీకి కలిసొచ్చే అంశమే. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో మాజీ విశ్వ సుందరి మనూషి చిల్లర్ హీరోయిన్గా నటించింది.