The Vaccine War Movie | మధ్య రాత్రిలోపు ఎప్పుడైనా రావొచ్చు.. ది వాక్సిన్ వార్ ట్రైలర్ అప్డేట్..!
The Vaccine War Movie | ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో వివేక్ అగ్నిహోత్రి సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. చిన్న సినిమాగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే కలెక్షన్లు కొల్లగొట్టింది. గతేడాది ఫిబ్రవరి చివరి వారంలో రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.350 కోట్లు కొల్లగొట్టి హిందీ నాట సరికొత్త రికార్డులు నెలకొల్పింది.
The Vaccine War Movie | ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో వివేక్ అగ్నిహోత్రి సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. చిన్న సినిమాగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే కలెక్షన్లు కొల్లగొట్టింది. గతేడాది ఫిబ్రవరి చివరి వారంలో రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.350 కోట్లు కొల్లగొట్టి హిందీ నాట సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ప్రాపగాండ సినిమా అని, కశ్మీరీ పండిట్ల ఊచకోత గురించి ఒకవైపే చెప్పారని ఎన్ని కామెంట్లు వచ్చినా.. జనాలు మాత్రం ఎగబడి మరీ సినిమా చూశారు. దక్షిణాదిన పెద్దగా ఆడలేదు కానీ.. ఉత్తరాదిన మాత్రం దాదాపు నెల రోజుల పాటు చాలా చోట్ల హౌజ్‌ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇక ఇప్పుడదే దర్శకుడి నుంచి వస్తున్న మరో సినిమా ది వాక్సిన్ వార్.
ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ను ప్రకటించారు. ఏ సమయంలోనైనా ట్రైలర్ రావచ్చొంటూ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. టైమ్ అని ఏం మెన్సన్ చేయలేదు కానీ.. ఈ రోజు అర్ధరాత్రి వరకు ఎప్పుడైనా వచ్చే చాన్స్ ఉందని తెలుస్తుంది. ఈ సినిమా కరోనా టైమ్‌లో జరిగిన పరిస్థితులు, ఇండియా తీసుకున్న చర్యలు, దేశంలో ఏర్పడ్డ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కింది. ఇది కూడా ప్రాపగాండ సినిమా అని ఇన్సైడ్ టాక్. ఇక ఈ సినిమాలో దాదాపుగా కశ్మీర్ ఫైల్స్ టీమ్‌నే తీసుకున్నారు.
ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను నిర్మించిన పల్లవి జోషినే ఈ సినిమాను కూడా నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతుంది. కాగా సలార్ రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాతే ఈ సినిమా కూడా అదే డేట్‌పై రావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చలే జరిగాయి. అయితే ఇప్పుడు సలార్ పోస్ట్ పోన్ అయింది. దాంతో ఈ సినిమా హిందీలో సోలోగానే రిలీజవుతుంది.
https://t.co/4h0FlLlgGM pic.twitter.com/Vz20z9Csia
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) September 12, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

