Mammootty Movie on OTT | ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తుంది. ప్రేక్షకులు కూడా థియేటర్లలో చిన్న సినమాలను చూడడానికి ఆంతగా ఆసక్తి చూపడంలేదు. పైగా ఒక ఫ్యామిలీ కొనే టికెట్ రేట్లతోనే ఓ ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఓటీటీ సంస్థలు కూడా మీడియం, చిన్న, పెద్ద అని తేడా లేకుండా సినిమాలను విక్రయించి తమ తమ ఓటీటీలలో నేరుగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తుంటారు. ఇప్పటికే పలు పెద్ద సినిమాలు కూడా నేరుగా ఓటీటీలో నే విడుదలయ్యాయి. తాజాగా మరో పెద్ద హీరో సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘పుజు’. ఫ్యామిలి ఇంటెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి రతీనా పి.టి దర్శకత్వం వహించారు. పార్వతి తిరువోతీ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కానున్నట్లు ప్రకటన వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్‌లో ఈ చిత్రం నేరుగా స్ట్రీమింగ్ కానుంది. లేటెస్ట్గా మమ్ముట్టి తనయుడు దుల్కర్ నటించిన ‘సెల్యూట్’ చిత్రం కూడా ఇటీవలే నేరుగా గురవారం నుంచి సోనిలివ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా గతంలోనే విడుదలకావాలి. కానీ పాండమిక్ కారణంతో విడుదల వాయిదా పడుతూ వస్తుంది. ఇక చివరికి థియేటర్ విడుదలను స్కిప్ చేసి ఓటీటీలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయానున్నారు.
#Puzhu Streaming Soon On @SonyLIV pic.twitter.com/7ktiiosd3g
— Mammootty (@mammukka) March 17, 2022