Kalamkaval | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) నటించిన తాజా చిత్రం ‘కళంకావల్'(Kalamkaval)కేరళ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. ఈ సినిమాకు జితిన్ జోస్ దర్శకత్వం వహించగా.. మమ్ముట్టి ఇందులో ప్రతినాయకుడి పాత్రలో నటించగా.. జైలర్ ఫేం వినాయకన్ కథానాయకుడిగా నటించాడు. డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో మమ్ముట్టి సైకో పాత్రలో కనిపించగా.. మమ్ముక్క నటన హైలైట్ అని ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీకెండ్ పెద్ద సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద లేకపోవడంతో ఈ చిత్రం మంచి కలెక్షన్లు రాబడుతుందని సమాచారం.