‘దర్శకుడు విఘ్నేష్రాజా గొప్ప సినిమా తీశాడు. అతని పేరు భవిష్యత్లో బాగా వింటారు. అసాధారణ పరిస్థితుల్లో చిక్కుకున్న ఓ సామాన్యుడి కథ ఇది. నిర్మాత సపోర్ట్ వల్లే సినిమా బాగా వచ్చింది. నమిత ప్రతిభ గల నటి. కెమెరా ముందు విశ్వరూపం చూపించింది. మంచి నటీనటులు ఇందులో భాగమయ్యారు. జీవి ప్రకాశ్ అద్బుతమైన పాటలు ఇచ్చాడు. గ్లోబల్గా నచ్చే కాన్సెప్ట్ ఇది. ఏప్రిల్ 30న వస్తుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి ’ అని తమిళ అగ్ర నటుడు ధనుష్ అన్నారు.
ఆయన హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘కర’. మమితాబైజు కథానాయిక. విఘ్నేష్ రాజా దర్శకుడు. ఐషరీ కె.గణేశ్ నిర్మాత. ఈ నెల 30న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్ మాట్లాడారు. అతిథిగా విచ్చేసిన సాయిదుర్గతేజ్ మాట్లాడుతూ ‘గొప్ప టీమ్ పనిచేసిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నా నమ్మకం.
నటుడిగా నాకు ధనుష్ ఆదర్శం. ఈ సినిమాలో ఆయన అద్భుతంగా నటించినట్టు ట్రైలర్ చెబుతున్నది. అందరితోపాటు నేనూ ఈ సినిమాకోసం ఎదురుచూస్తున్నా. ఆల్ది బెస్ట్ ‘కర’ టీమ్’ అని సాయిదుర్గతేజ్ అన్నారు. కె.ఎస్.రవికుమార్, కుష్మిత గణేశ్ తదితర చిత్రబృందంతోపాటు దర్శకులు వెంకీ అట్లూరి, బుచ్చిబాబు సానా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.