HomeCinemaMamannan Is A Blockbuster Hit In Tamil The Dubbing Version Of The Film Nayakudu Is Owning Record Streaming In Ott
Nayakudu Movie Review | ఓటీటీలో రికార్డు సృష్టిస్తున్న నాయకుడు.. సినిమా కథ ఇదీ!
Nayakudu Movie Review | తమిళంలో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన చిత్రం మామన్నన్. ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్ ‘నాయకుడు’ ఓటీటీలో రికార్డు స్ట్రీమింగ్ సొంతం చేసుకుంటున్నది. కథలో బలం, కథనంలో కొత్తదనం ఈ రెండూ ‘నాయకుడు’ బలం. నిజమైన నాయకుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో ఈ సినిమా తెలియజేస్తుంది.
సినిమా పేరు : నాయకుడు (మామన్నన్)
నెట్ఫ్లిక్స్:జూలై 27
తారాగణం:ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాజిల్, కీర్తి సురేశ్ తదితరులు
దర్శకత్వం:మారి సెల్వరాజ్
తమిళంలో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన చిత్రం మామన్నన్. ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్ ‘నాయకుడు’ ఓటీటీలో రికార్డు స్ట్రీమింగ్ సొంతం చేసుకుంటున్నది. కథలో బలం, కథనంలో కొత్తదనం ఈ రెండూ ‘నాయకుడు’ బలం. నిజమైన నాయకుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో ఈ సినిమా తెలియజేస్తుంది. కథలోకి వెళ్తే మహారాజు (వడివేలు) బలహీన వర్గాల ప్రతినిధిగా ఎదిగి ఎమ్మెల్యే అవుతాడు. అతని కొడుకు రఘువీర (ఉదయనిధి స్టాలిన్) విద్యాధికుడు.
ఊళ్లోనే మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తుంటాడు. మరోవైపు ఎంత ఎదిగినా తన కులవృత్తి అయిన పందుల పెంపకాన్ని కొనసాగిస్తుంటాడు. అదే ఊళ్లో మరో నాయకుడు రత్నవేలు (ఫహద్ ఫాజిల్) ఉన్నతవర్గానికి ప్రతినిధిగా చెలామణీ అవుతుంటాడు. రఘువీర స్నేహితురాలు లీలా (కీర్తి సురేశ్) స్థానికంగా విద్యార్థులకు ఉచిత కోచింగ్ సెంటర్ నడుపుతుంటుంది. కొందరు ఆమె కోచింగ్ సెంటర్ను బలవంతంగా మూయించే ప్రయత్నం చేస్తుంటారు. ఆ కోచింగ్ సెంటర్కు రత్నవేలుకు ఉన్న సంబంధం ఏమిటి? ఉన్నత వర్గీయుల రాజకీయాలను మహారాజు, రఘువీర ఎలా ఎదుర్కొన్నారన్నది మిగిలిన కథ! అక్కడక్కడా నిదానంగా సాగే కథనం కాస్త విసుగు పుట్టించినా.. పతాక సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి.