నరుడా డోనరుడా సినిమాతో డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు మల్లిక్‌రామ్ (Mallik Ram). అద్భుతం, పెళ్లి గోల, తరగతి గది దాటి.. వంటి ఓటీటీ ప్రాజెక్టులతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ యువ దర్శకుడు ప్రస్తుతం సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో టిల్లు 2 (Tillu Square)ను డైరెక్ట్ చేస్తున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా డీజే టిల్లుకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా డైరెక్టర్ మల్లిక్ రామ్‌కు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది.
ఈ దర్శకుడు ప్రతిష్టాత్మక బాలీవుడ్ నిర్మాణ సంస్థతోపాటు టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడని తాజా టాక్. ప్రస్తుతం టిల్లు 2 షూటింగ్ చేస్తూనే.. మరోవైపు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ షో ప్రీ ప్రొడక్షన్ పనులపై ఫోకస్పెట్టాడట. వైజాగ్ నుంచి వచ్చిన మల్లిక్ రామ్ రొటీన్ దర్శకులలాగా చిన్న సినిమాలను డైరెక్ట్ చేయడం పక్కన పెట్టి.. మోస్ట్ ఎవెయిటెడ్ సినిమాలపైనే ఫోకస్ పెడుతూ అగ్రదర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
మల్లిక్‌రామ్ టాలెంట్‌కు ఇంప్రెస్ అయిన చాలా మంది నిర్మాతలు అతనితో సినిమా చేయాలని లైన్ కడుతున్నారని జోరుగా చర్చ నడుస్తోంది. రాబోయే కాలంలో మల్లిక్‌రామ్ స్టార్ డైరెక్టర్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదని.. తాజా అప్డేట్తో అర్థమవుతుంది.
Read Also : Avatar : The Way Of Water | తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 రెస్పాన్స్ ఎలా ఉందంటే.. ?
Read Also : Dil Raju | వారసుడు ఫస్ట్ ఛాయిస్ విజయ్ కాదట.. ఇంతకీ ఎవరో చెప్పిన దిల్ రాజు
Read Also : Indian 2 | ఇండియన్ 2 అప్డేట్.. కమల్‌హాసన్ డెడికేషన్‌కు ఫిదా అవ్వాల్సిందే.. !
Read Also : Venkatesh | వెంకటేశ్‌ను ఇంప్రెస్ చేయలేకపోతున్న డైరెక్టర్లు.. స్టోరీ రైటర్ కావాలట..!