Malla Reddy| టాలీవుడ్లో హీరోల స్థానాలు ఎప్పుడు మారిపోతూ ఉంటాయి. ఒకప్పుడు టాప్ లో ఉన్నవారు ఇప్పుడు కాస్త కిందకి దిగడం మనం చూస్తూనే ఉన్నాం. గతంలో మెగాస్టార్ చిరంజీవి ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నారు. అగ్రహీరోగా కొన్నేళ్లపాటు ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఇక ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో స్థానాన్ని ఇతరులు కైవసం చేసుకున్నారు. అయితే ఇదే సమయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. చిరంజీవి తర్వాత ఆ స్థానాన్ని అల్లు అర్జున్ ఆక్రమించాడని, ఇప్పుడు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా అతని క్రేజ్ తారాస్థాయికి వెళ్లిందని చెప్పుకొచ్చారు. అందుకే ప్రతి ఒక్కరూ అప్ డేట్ కావాలి అంటూ మల్లారెడ్డి పేర్కొన్నారు
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. పుష్ప చిత్రం బన్నీకి ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ క్రేజ్త పుష్పకి సీక్వెల్‌గా పుష్ప2 చిత్రం చేశాడు. ఈ మూవీ 1800 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో బన్నీ సెన్సేషనల్ హీరో అయ్యాడు. ఒకప్పుడు టాలీవుడ్లో చిరంజీవి ఎప్పుడూ మెగాస్టార్‌గా ఒక గొప్ప స్థాయిలో ఉండగా, కొత్త తరానికి బన్నీ మరింత కనెక్ట్ అయ్యాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పుష్ప2 తర్వాత హాలీవుడ్ ప్రముఖులు సైతం బన్నీపై ప్రశంసలు కురిపించడం మనం చూశాం. తాజాగా మల్లారెడ్డి కూడా బన్నీని ఆకాశానికి ఎత్తడం గమనర్హం.
చిరంజీవి విషయానికి వస్తే ఆయన కెరీర్లో ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి సినిమాలు ఎంతటి బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నాయో మనం చూశాం. రీఎంట్రీ తర్వాత కూడా ఖైదీ నెంబర్ 150 లాంటి హిట్‌ను అందుకున్నారు చిరు. ఆ తర్వాత మాత్రం ఒక్క చిత్రం కూడా పెద్దగా జనాలని ఆకట్టుకోలేకపోయింది. పాన్ ఇండియా సంగతి పక్కన పెడితే తెలుగు రాష్ట్రాలలోను చిరు తన సినిమాలతో అలరించలేకపోయాడు. అయితే చిరు క్రేజ్ ఇప్పటికీ స్థిరంగా ఉన్నప్పటికీ, కొత్త తరానికి మరింత కనెక్ట్ అయ్యేందుకు సరికొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని కొందరు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు విశ్వంభర సినిమాపై ఆయన భారీ అంచనాలు పెట్టుకోగా, ఈ మూవీతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.