Vrusshabha | ఎల్ 2 ఎంపురాన్, తుడరుమ్ వంటి బ్లాక్ బస్టర్లను అందుకున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే లల్లెట్టన్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన అభిమానులకు ఓ అదిరిపోయే అప్డేట్ అందింది. ఆయన తదుపరి పాన్-ఇండియా చిత్రం ‘వృషభ’ నుండి ఫస్ట్ లుక్‌ను మేకర్స్ ఈరోజు విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. 2025 అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘వృషభ’ చిత్రాన్ని మలయాళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించినట్లు సమాచారం. ఈ సినిమా తెలుగు, మలయాళంతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
నంద కిషోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్. వ్యాస్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా వంటి ప్రముఖ నిర్మాతలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కనెక్ట్ మీడియా మరియు బాలాజీ టెలిఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. మోహన్‌లాల్ కెరీర్లో మరో భారీ పాన్-ఇండియా చిత్రంగా ‘వృషభ’ నిలవనుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఫస్ట్ లుక్‌తో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
MOHANLAL’S FIRST LOOK FROM PAN-INDIA FILM ‘VRUSSHABHA’ UNVEILED ON HIS BIRTHDAY – 16 OCT 2025 RELEASE… On #Mohanlal‘s [@Mohanlal] birthday today, here’s an exciting update – the #FirstLook from his upcoming film #Vrusshabha.
Slated for release on 16 Oct 2025, #Vrusshabha has… pic.twitter.com/fqEAkh84t5
— taran adarsh (@taran_adarsh) May 21, 2025